Share News

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:58 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పలు శాఖల అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు సత్వరమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
అర్జీదారుల సమస్యలను ఆలకిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పీజీఆర్‌ఎస్‌లో వినతుల స్వీకరణ

పాడేరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పలు శాఖల అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు సత్వరమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఆర్డీవో ఎంవీఎస్‌ లోకేశ్వరరావులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తనకు వితంతు పెన్షన్‌ మంజూరు చేయాలని హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన టి.రొయిల కోరారు. చింతపల్లి మండలం గొర్రెలగెడ్డ గ్రామానికి అంగన్‌వాడీ కేంద్ర మంజూరు చేయాలని సర్పంచ్‌ జి.శ్యామల, గ్రామస్థులు జి.వెంకటస్వామి, జి.రాజేశ్వరి తదితరులు అర్జీ అందజేశారు. పాడేరులోని లోచలిపుట్టు వీధికి చెందిన తనకు అధికారులు ఇంటి స్థలం పట్టా ఇచ్చినప్పటికీ, స్థలం చూపించలేదని జి.పార్వతి ఫిర్యాదు చేశారు. పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ వనగరాయి, సరియాపల్లి గ్రామాలకు చెందిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయడంలేదని, దీనిస్థానంలో కొత్తది అమర్చాలని స్థానికులు కోరారు. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ బాకూరువలస నుంచి పొంటారిపాడు గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని ఎంపీటీసీ సభ్యుడు మజ్జి హరి, గ్రామస్థలు కోరారు. పాడేరు మండలం వంజంగి పంచాయతీ పోతురాజుమెట్ట, పైనంపాడు, రాసమెట్ట గ్రామాల్లోని పాఠశాలలకు భవనాలను నిర్మించాలని స్థానికులు కె.రాజారావు, కె.యేసయ్యబాబు, పి.కొండమ్మ అర్జీ అందజేశారు. పాడేరు మండలం జి.ముంచంగిపుట్టు పంచాయతీ కొత్తవీధి గ్రామానికి ఇంటింటా తాగునీటి కుళాయిలు వేయాలని పి.పద్మ, వి.కన్యాకుమారి, పి.స్వాతి, తదితరులు వినతిపత్రం సమర్పించారు. కాగా

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులు అందజేసిన వారు తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోతే 1100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. అర్జీలకు సంబంధించిన ఎండార్స్‌మెంటును అర్జీదారులకు రిజిస్టర్‌ పోస్టులో పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, డీఎంహెచ్‌వవో కృష్ణమూర్తి నాయిక్‌, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రమణారావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, డీపీవో చంద్రశేఖర్‌, పీఆర్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:58 AM