Share News

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:18 AM

మండలంలోని నూతనగుంటపాలెం వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ఏడుగురికి స్వల్ప గాయాలు

స్టీరింగ్‌ లాక్‌ కావడంతో అదుపుతప్పిన బస్సు

కశింకోట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని నూతనగుంటపాలెం వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. బుధవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ సంఘటనలో ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి. ఒడిశా రాష్ట్రం అడ్డుబంగి నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బుధవారం హైదరాబాద్‌ వెళుతున్నది. కశింకోట మండలం నూతనగుంటపాలెం రిలయన్స్‌ బంకు వద్దకు వచ్చేసరికి వేగాన్ని అదుపుచేసే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తి స్టీరింగ్‌ లాక్‌ అయ్యింది. దీంతో బస్సు ఎడమ వైపు ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న 35 మందిలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ అల్లు స్వామినాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగితెలుసుకున్నారు.

Updated Date - Aug 14 , 2025 | 01:18 AM