Share News

ప్రధాని తిరుగు ప్రయాణం

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:12 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి నగరానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ శనివారం తిరిగి ప్రయాణమయ్యారు.

ప్రధాని తిరుగు ప్రయాణం

గోపాలపట్నం (విశాఖపట్నం), జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి నగరానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ శనివారం తిరిగి ప్రయాణమయ్యారు. నేవీ గెస్ట్‌హౌస్‌ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆత్మీయ వీడ్కోలు

నగరంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి ప్రయాణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌లకు విమానాశ్రయంలో నేతలు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 1.44 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఉదయం 9.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌కు జనసేన పార్టీ నేతలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):

పూరీ జగన్నాథుని రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ప్రవేశ పెడుతున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. విశాఖ-పూరీ-విశాఖ: 08313 నంబరు గల రైలు ఈ నెల 27, జూలై 5 తేదీల్లో 00.45 (ఈ నెల 26, జూలై 4వ తేదీ అర్ధరాత్రి 12.45 గంటలకు) విశాఖలో బయలుదేరి అదేరోజు (ఈ నెల 27, జూలై 5న) మధ్యాహ్నం 12 గంటలకు పూరీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08314 నంబరు గల రైలు ఈ నెల 28, జూలై 6 తేదీల్లో వేకువజామున 2.15 గంటలకు పూరీలో బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.00 గంటకు విశాఖ చేరుతుంది.

రాయగడ-ఖుర్దా రోడ్డు-రాయగడ

08593 నంబరు గల రైలు ఈ నెల 26, జూలై 4 తేదీల్లో ఉదయం 11 గంటలకు రాయగడలో బయలుదేరి అదేరోజు రాత్రి 11.45 గంటలకు ఖుర్దా రోడ్డు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08594 నంబరు గల రైలు ఈ నెల 28, జూలై 6 తేదీల్లో వేకువజాము 1.00 గంటలకు ఖుర్దారోడ్డులో బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు రాయగడ చేరుతుందని డీసీఎం తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 01:12 AM