Share News

కొండెక్కిన కొబ్బరికాయల ధర

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:39 PM

కొబ్బరి కాయల ధర కొండెక్కి కూర్చొంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది.

కొండెక్కిన కొబ్బరికాయల ధర
విక్రయానికి ఉంచిన కొబ్బరికాయలు

చిన్న కాయ రూ.40

మోస్తరు కాయ రూ.50 నుంచి రూ.60

ముంచంగిపుట్టు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి కాయల ధర కొండెక్కి కూర్చొంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. దీంతో కొబ్బరి కాయలను కొనాలంటేనే వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైదాన ప్రాంతాల్లో ఈ ఏడాది కొబ్బరి దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, ప్రస్తుతం దసరా ఉత్సవాల నేపథ్యంలో వాటి ధరకు మరికాస్త రెక్కలు వచ్చాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం చిన్న సైజ్‌ కొబ్బరికాయ ధర రూ.40 కాగా.. ఒక మోస్తరు సైజ్‌ కొబ్బరికాయ ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. కొబ్బరికాయల ధర మునుపెన్నడు లేని విధంగా అమాంతంగా పెరగడంలో వినియోగదారులు వాటిని కొనేందుకు ఆలోచించక తప్పడం లేదు. రానున్న రోజుల్లో వాటి ధర మరికాస్త పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Oct 04 , 2025 | 11:39 PM