Share News

పచ్చదనంతో వాయు కాలుష్యం నివారణ

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:32 PM

పచ్చదనాన్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టిశ్రీపూజ అన్నారు.

పచ్చదనంతో వాయు కాలుష్యం నివారణ
ర్యాలీలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టిశ్రీపూజ, పక్కన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

ఐటీడీఏ పీవో టిశ్రీపూజ

పాడేరులో ఘనంగా ‘గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌’

పాడేరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పచ్చదనాన్ని నాశనం చేస్తే భవిష్యత్తు తరాలకు పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టిశ్రీపూజ అన్నారు. మూడో శనివారం పురస్కరించుకుని స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా జిల్లా కేంద్రంలో పరిశుభ్రమైన గాలి అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మొక్కలు విరివిగా నాటి వాయు కాలుష్యం లేకుండా ఉంచాలన్నారు. మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం సైతం స్వచ్ఛభారత్‌, స్వచ్ఛాంధ్ర పేరిట పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. వాయు కాలుష్య కాకుండా, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అంతకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి పీటీడీ బస్‌ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, ఏడీఎంహెచ్‌వో టీవీ.ప్రతాప్‌, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, పీటీడీ డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా నోడల్‌ అధికారి జి.గౌరిశంకరరావు, అధికారులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర

స్థానిక కలెక్టరేట్‌లో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత కలెక్టరేట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అలాగే అధికారులు, సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చే యించారు. ఈకార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో కె.ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ డి.లక్ష్మయ్య, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:32 PM