Share News

అధ్యక్షునిగా పట్టాభి

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:22 AM

విశాఖపట్నం పార్లమెంటరీ నియోజక వర్గానికి తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో కలిపి 41 మందికి కమిటీలో చోటు కల్పించింది.

అధ్యక్షునిగా పట్టాభి

ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ

41 మందితో టీడీపీ

విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ

ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు

తొమ్మిది మంది చొప్పున నియామకం

విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పార్లమెంటరీ నియోజక వర్గానికి తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో కలిపి 41 మందికి కమిటీలో చోటు కల్పించింది. ఈ పర్యాయం ఎక్కువ మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. కమిటీలో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను నియమించారు. అధ్యక్షునిగా చోడే వెంకట పట్టాభి, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణను ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షులుగా గొర్రపల్లి రాము (ఎస్‌.కోట), పొలిమెర సీతారామ్‌ (విశాఖపట్నం పశ్చిమ),కరణం సత్యారావు (గాజువాక), అబ్దుల్‌ హనీఫ్‌, అలతి హేమలత (విశాఖ ‘సౌత్‌’), బమ్మిడి ఉమ (భీమిలి), బొట్టా వెంకటరమణ (విశాఖ తూర్పు), కోట నరేష్‌ (విశాఖ ‘నార్త్‌’), గరికిన ఎల్లయ్య (భీమిలి)ని నియమించారు.

ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా నక్కరాజు చిన్నరాము (ఎస్‌.కోట), దాసరి శివశంకరరావు (విశాఖ పశ్చిమ), కణితి సన్యాసమ్మ, గోక్యాడ ముత్యాలు (గాజువాక), గనగళ్ల సత్యవతి, కందిపల్లి వరలక్ష్మి (విశాఖ ‘సౌత్‌’), ఒమ్మి పోలారావు (విశాఖ తూర్పు), ఏడుకొండలు (విశాఖ ‘నార్త్‌’), బోర అప్పలసూరిబాబు (భీమిలి)ను నియమించారు.

అలాగే, అధికార ప్రతినిధులుగా ఇందుకూరి శ్రీనివాసరాజు (ఎస్‌.కోట), పిడుగు మంగ లక్ష్మి, నందవరపు సోములు (విశాఖ పశ్చిమ), విల్లూరి భాస్కరరావు (విశాఖ ‘సౌత్‌’), చెట్టుపల్లి గోపి (భీమిలి), బూసి రాంబాబు, పాత్రకొండ ధర్మారావు (విశాఖ తూర్పు), తోట శ్రీదేవి (విశాఖ తూర్పు), బాబ్జీ షేక్‌ (విశాఖ ‘నార్త్‌’)ను నియమించారు.

సెక్రటరీలుగా గుమ్మడి భారతి, జోగారావు చుక్కా, అంగి సత్యవతి (ఎస్‌.కోట), గొట్టిపాటి వెంకట సురేష్‌కుమార్‌ (విశాఖ ఉత్తరం), బాశెట్టి అప్పారావు (గాజువాక), తాడి వేణుకుమారి (విశాఖ దక్షిణం), అన్ను సుమిత్ర (విశాఖ ఉత్తరం), ఉసిరికాయల ఢిల్లీశ్వరి (విశాఖ తూర్పు), కొల్లి చిరంజీవి (భీమిలి)ని నియమించారు. ట్రెజరర్‌గా గునిశెట్టి నాగేశ్వరరావు (విశాఖ పశ్చిమ), ఆఫీస్‌ సెక్రటరీగా అప్పారావు బండారి (విశాఖ ఉత్తరం), మీడియా కో-ఆర్డినేటర్‌గా బైరెడ్డి పోతనరెడ్డి (విశాఖ తూర్పు), సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా కొత్తపల్లి ఉషారాణి (గాజువాక) నియమితులయ్యారు.

Updated Date - Dec 25 , 2025 | 01:22 AM