Share News

ఏటికొప్పాక కళాకారుడికి రాష్ట్రపతి పురస్కారం

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:27 AM

అంకుడు కర్రతో తయారు చేసే లక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు గొర్సా సంతోశ్‌ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. సంతోశ్‌ వివిధ దేవతామూర్తులతో బొమ్మల కొలువును తయారుచేసినందుకు 2023-24 సంవత్సరానికి ఉత్తమ హస్తకళల పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే.

ఏటికొప్పాక కళాకారుడికి రాష్ట్రపతి పురస్కారం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఏటికొప్పాక హస్తకళాకారుడు గొర్సా సంతోశ్‌

ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డు అందుకున్న గొర్సా సంతోశ్‌

ఎలమంచిలి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అంకుడు కర్రతో తయారు చేసే లక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు గొర్సా సంతోశ్‌ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. సంతోశ్‌ వివిధ దేవతామూర్తులతో బొమ్మల కొలువును తయారుచేసినందుకు 2023-24 సంవత్సరానికి ఉత్తమ హస్తకళల పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము అవార్డును అందించారు. సంతోశ్‌ సుమారు నెలరోజులపాటు శ్రమించి బొమ్మల కొలువు కళాఖండాన్ని తయారు చేశారు. గతంలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ తరపున పాల్గొన్న శకటాన్ని ఏటికొప్పాక హస్తకళలను ప్రతిబింబించేలా తయారీ చేసిన వారిలో సంతోశ్‌ కీలకపాత్ర పోషించారు.

Updated Date - Dec 10 , 2025 | 01:27 AM