Share News

అగ్రిసెట్‌లో సత్తా

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:00 PM

అగ్రిసెట్‌ ఫలితాల్లో చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో మొదటి నాలుగు ర్యాంకులను కళాశాల విద్యార్థులు సాధించారని ప్రిన్సిపాల్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

అగ్రిసెట్‌లో సత్తా
తర్రా రాంజీ (ఫస్ట్‌ ర్యాంకు)

రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు ర్యాంకులు సాధించిన చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులు

చింతపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అగ్రిసెట్‌ ఫలితాల్లో చింతపల్లి ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో మొదటి నాలుగు ర్యాంకులను కళాశాల విద్యార్థులు సాధించారని ప్రిన్సిపాల్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం పరిధిలో అగ్రికల్చర్‌ బీఎస్సీలో ప్రవేశాలు పొందేందుకు ఈ ఏడాది ఆగస్టులో అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్ష జరిగిందన్నారు. కళాశాలలో 2023-25 విద్యాసంవత్సరంలో ఆర్గానిక్‌ పాలిటెక్నిక్‌ కోర్సును అభ్యసించిన విద్యార్థులు 15 మంది ఈ పరీక్ష రాశారన్నారు. మంగళవారం రాత్రి అగ్రిసెట్‌ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారని తెలిపారు. ఈ ఫలితాల్లో ఆర్గానిక్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో తర్రా రాంజీ(శ్రీకాకుళం) ప్రథమ ర్యాంకు, కుంతూరు మురళీకృష్ణ(పాడేరు) ద్వితీయ, మినుముల రాజ్‌కుమార్‌(జి.మాడుగుల) తృతీయ, పట్నాల శ్రీకావ్య(విశాఖపట్నం) నాలుగోవ ర్యాంకు సాధించారన్నారు. వీరికి ఏజీబీఎస్సీ సీట్లు వస్తాయని తెలిపారు.

Updated Date - Sep 24 , 2025 | 11:00 PM