96.72% మందికి పోలియో చుక్కలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:52 AM
‘మన బిడ్డల భవిష్యత్తు- మన బాధ్యత’ నినాదంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 1,446 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అనకాపల్లి టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘మన బిడ్డల భవిష్యత్తు- మన బాధ్యత’ నినాదంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 1,446 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా 97 వేల 810 మందికిగాను సాయంత్రానికి లక్షా 91 వేల 319 మందికి పోలియో చుక్కలు వేసినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.హైమావతి చెప్పారు. అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, తదితరులు పాల్గొని పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.