ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పోలీసుల తనిఖీ
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:55 AM
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్, ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌లో ఆదివారం విస్తృత సోదాలు నిర్వహించారు.
డాబాగార్డెన్స్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి):
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్, ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌లో ఆదివారం విస్తృత సోదాలు నిర్వహించారు. టౌ టూన్ సీఐ ఎర్రన్నాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్‌ఐసీ రోడ్డు, డీఆర్‌ఎం కార్యాలయం తదితర ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల బ్యాగ్‌లు, కారు డిక్కీలు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రి గస్తీతో పాటు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు ప్రజలు, ఎస్‌ఐలు సతీష్, మన్మథరావు, ఏఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.