Share News

బడి తెరిపించండి.. ప్లీజ్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:46 AM

మండలంలోని వాలసీ పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక మూతపడింది. ఇక్కడి ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ నెల 12న సమీప గ్రామంలోని ఉపాధ్యాయుడితో పాఠశాలను పునఃప్రారంభించారు. ఆ మర్నాడు నుంచి ఎవరూ రాలేదు.

బడి తెరిపించండి.. ప్లీజ్‌
పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

- వేడుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

- ఉపాధ్యాయుడు లేక పాఠశాల మూసివేత

అనంతగిరి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వాలసీ పంచాయతీ నిమ్మలపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేక మూతపడింది. ఇక్కడి ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ నెల 12న సమీప గ్రామంలోని ఉపాధ్యాయుడితో పాఠశాలను పునఃప్రారంభించారు. ఆ మర్నాడు నుంచి ఎవరూ రాలేదు. దీంతో పాఠశాలలోని 81 మంది విద్యార్థులు చదువుకు దూరమవు తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి రోజూ విద్యార్థులు పాఠశాలకు రావడం, మూసి ఉండడంతో గంటల పాటు వేచి ఉండి ఇంటికి వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని స్కూల్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శిల్ప నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిని నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:46 AM