Share News

స్వర్ణాంధ్ర విజన్‌- 2047కు ప్రణాళికలు సిద్ధం

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:41 AM

స్వరాంధ్ర విజన్‌- 2047కు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా అఽధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వర్ణాంధ్ర విజన్‌- 2047కు ప్రణాళికలు సిద్ధం
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎన్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): స్వరాంధ్ర విజన్‌- 2047కు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా అఽధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు జిల్లా విజన్‌ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా అధికారులతో వ్యవసాయం, ఉద్యానవనం, పర్యాటకం, మహిళా శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన పీ4పై జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధారాణి కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షిస్తారన్నారు. అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. గంజాయి సాగును విడిచిపెట్టిన గిరిజన రైతులకు ఉద్యాన వన మొక్కలను పంపిణీ చేస్తారన్నారు. ఇద్దరు మంత్రుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, టీడబ్ల్యూ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా ఉద్యాన వనాధికారి ఎ.రమేశ్‌కుమార్‌ జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, డ్వామా పీడీ విద్యాసాగర్‌, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:41 AM