Share News

రబీలో అపరాలు, వేరుశెనగ సాగుకు ప్రణాళిక

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:31 AM

గిరిజన ప్రాంతంలో రబీకి అపరాలు, వేరుశెనగ సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు తెలిపారు. గురువారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆయన చిన్నగెడ్డలో గిరిజన రైతుల సాగు చేస్తున్న వరి, రాజ్‌మా, వలిసెలు, రాజ్‌మా పంటలను పరిశీలించారు.

రబీలో అపరాలు, వేరుశెనగ సాగుకు ప్రణాళిక
రైతులకు వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేసిన డీఏవో నందు

- జిల్లా వ్యవసాయాధికారి నందు

చింతపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో రబీకి అపరాలు, వేరుశెనగ సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌ నందు తెలిపారు. గురువారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆయన చిన్నగెడ్డలో గిరిజన రైతుల సాగు చేస్తున్న వరి, రాజ్‌మా, వలిసెలు, రాజ్‌మా పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో ఆదివాసీ రైతులు పంట పొలాలను ఖాళీగా విడిచిపెడుతున్నారన్నారు. దీంతో అతి తక్కువ మంది రబీలో రెండవ పంటను సాగు చేస్తున్నారన్నారు. రబీలో రైతుల పంట పొలాలు ఖాళీగా విడిచిపెట్టకుండా ఉండేందుకు ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రధానంగా మినుములు, పెసలు, వేరుశెనగ సాగు చేసేందుకు రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో అపరాలు, వేరుశెనగ పంటలను సాగు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజన రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, చూచనలు పాటిస్తూ అపరాలు, వేరుశెనగ పంటలను సాగు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బి.ప్రభాకరరావు, వ్యవసాయాధికారి మధుసూదనరావు, కూటమి నాయకులు రీమల ఆనందరావు, మంగ్లు, వల్లి, ఏఎంసీ డైరెక్టర్‌ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:31 AM