Share News

నైట్‌ ఫుడ్‌ కోర్టుపై హైకోర్టులో పిల్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:23 AM

విశాఖపట్నం పాత జైలు రోడ్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న నైట్‌ ఫుడ్‌ కోర్టును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బధవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీవీఎంసీ కమిషనర్‌, విశాఖ కలెక్టర్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. విచారణను వాయిదా వేసింది.

నైట్‌ ఫుడ్‌ కోర్టుపై  హైకోర్టులో పిల్‌

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న

దుకాణాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ

ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు

జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌లకు నోటీసులు జారీ

కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

అమరావతి/విశాఖపట్నం జూన్‌ 25(ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పాత జైలు రోడ్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న నైట్‌ ఫుడ్‌ కోర్టును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బధవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీవీఎంసీ కమిషనర్‌, విశాఖ కలెక్టర్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం పాత జైలు రోడ్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా అనధికారికంగా నైట్‌ఫుడ్‌ కోర్టును నిర్వహిస్తున్నా జీవీఎంసీ కమిషనర్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కార్పొరేటర్‌ పీవీఎల్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపించారు. అనధికార స్టాళ్లతో జీవీఎంసీ ఆదాయం కోల్పోతుందన్నారు. దారికి అడ్డంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తూ సెంట్రల్‌ పార్కుకు వెళ్లే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అనధికారికంగా ఏర్పాటుచేసిన స్టాళ్లను తొలగించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

Updated Date - Jun 26 , 2025 | 01:23 AM