Share News

నేడు నర్సీపట్నంలో పీజీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:52 AM

నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు నర్సీపట్నంలో పీజీఆర్‌ఎస్‌

నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల డివిజన్‌స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లిలోని కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - Apr 28 , 2025 | 12:52 AM