Share News

ఆరు రహదారుల అభివృద్ధికి అనుమతులు

ABN , Publish Date - May 03 , 2025 | 11:52 PM

నియోజకవర్గంలో రూ.5.3 కోట్లతో చేపట్టబోయే రహదారుల అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు వచ్చినట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శనివారం తెలిపారు. నాతవరం నుంచి గుమ్మిడిగొండకి 4.5 కిలోమీటర్లు, గిడుతూరు నుంచి కైలాసపట్నం వరకు 9.6, చీడిగుమ్మల నుంచి పాకలపాడు మీదుగా పీజీపేట వరకు 5.1, ఏఎల్‌పురం నుంచి కొంకసింగి 3.1, బయపురెడ్డి పాలెం వంతెన నుంచి ఎరకన్నపాలెం వరకు 6.6, వేములపూడి నుంచి కన్నంపేట మీదుగా వెలగలపూడి వరకు 6 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఆరు రహదారుల అభివృద్ధికి అనుమతులు
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

- స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రూ.5.3 కోట్లతో చేపట్టబోయే రహదారుల అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు వచ్చినట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు శనివారం తెలిపారు. నాతవరం నుంచి గుమ్మిడిగొండకి 4.5 కిలోమీటర్లు, గిడుతూరు నుంచి కైలాసపట్నం వరకు 9.6, చీడిగుమ్మల నుంచి పాకలపాడు మీదుగా పీజీపేట వరకు 5.1, ఏఎల్‌పురం నుంచి కొంకసింగి 3.1, బయపురెడ్డి పాలెం వంతెన నుంచి ఎరకన్నపాలెం వరకు 6.6, వేములపూడి నుంచి కన్నంపేట మీదుగా వెలగలపూడి వరకు 6 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీని వలన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో 15 రోడ్లు అభివృద్ధికి రూ.11.85 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 11:52 PM