Share News

మిరియాలు కిలో రూ.600

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:30 PM

మన్యంలో ప్రస్తుతం కిలో మిరియాలు రూ.600 ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం వారపు సంతల్లో, గ్రామాల్లో వర్తకులు రూ.580 నుంచి రూ.600లకు కొనుగోలు చేస్తున్నారు.

మిరియాలు కిలో రూ.600
స్వచ్ఛమైన నల్ల మిరియాలు

వారపు సంతల్లో వర్తకులు కొనుగోలు

పాడేరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మన్యంలో ప్రస్తుతం కిలో మిరియాలు రూ.600 ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం వారపు సంతల్లో, గ్రామాల్లో వర్తకులు రూ.580 నుంచి రూ.600లకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మిరియాల ధర ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలోనే కిలో రూ.550 చొప్పున వర్తకులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. క్రమంగా రూ.570 నుంచి రూ.580కు పెరిగింది. తాజాగా కించుమండ వారపు సంతలో కిలో రూ.600 చొప్పున గిరిజన రైతులు వర్తకులకు మిరియాలను విక్రయించారు. గత ఐదేళ్లుగా మిరియాలు ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:30 PM