Share News

గోవాడ రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించండి

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:16 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ చెరకు రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడానికి చర్యలు చేపట్టాలని, క్రషింగ్‌ సీజన్‌ కొనసాగింపుపై యాజమాన్యం తరఫున బహిరంగ ప్రకటన చేయాలని ఏపీ రైతు సంఘం సీఐటీయూ నాయకులు శుక్రవారం కొత్తగా నియమితులైన గోవాడ షుగర్స్‌ ఎండీ వెంకటేశ్వరరావుకి విజ్ఞప్తి చేశారు.

గోవాడ రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించండి
ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం నాయకులు

క్రషింగ్‌పై బహిరంగ ప్రకటన చేయాలి

గోవాడ ఫ్యాక్టరీ కొత్త ఎండీకి ఏపీ రైతు సంఘం నేతల వినతి

చోడవరం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ చెరకు రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడానికి చర్యలు చేపట్టాలని, క్రషింగ్‌ సీజన్‌ కొనసాగింపుపై యాజమాన్యం తరఫున బహిరంగ ప్రకటన చేయాలని ఏపీ రైతు సంఘం సీఐటీయూ నాయకులు శుక్రవారం కొత్తగా నియమితులైన గోవాడ షుగర్స్‌ ఎండీ వెంకటేశ్వరరావుకి విజ్ఞప్తి చేశారు. బకాయిలు చెల్లించడంతో పాటు వచ్చే సీజన్‌కు సంబంధించి ఫ్యాక్టరీ నడిపించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన ఇవ్వాలని కోరారు. అనంతరం రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాయనిబాబు. వి.వి. శ్రీనివాసరావు, ఎస్‌వీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:16 AM