రోగులకు మెరుగైన వైద్యం అందాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:45 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యులు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు అన్నారు.
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు
చింతపల్లి ఏరియా ఆస్పత్రి, కోరుకొండ, లోతుగెడ్డ పీహెచ్‌సీ తనిఖీ
చింతపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యులు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు అన్నారు. గురువారం చింతపల్లి ఏరియా ఆస్పత్రి, కోరుకొండ, లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుకొండ పీహెచ్‌సీలో ప్రతి నెల 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, దీనికి గాను వైద్యులను అభినందించారు. ప్రతి పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెరగాలన్నారు. వైద్య సిబ్బంది రోగులకు అన్నివేళలా అందుబాటులో ఉండాలని చెప్పారు. కోరుకొండ గర్భిణుల వసతి గృహాన్ని సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జగదీశ్వరరావు, ఎంపీహెచ్‌ఈవో గుల్లెలి సింహాద్రి పాల్గొన్నారు.