అడ్డదిడ్డంగా పార్కింగ్
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:39 AM
జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ద్విచక్ర వాహనాలను ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చిన రీతిలో పార్కింగ్ చేస్తున్నారు. పోలీసులు ‘నో పార్కింగ్’ అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినచోట కూడా వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే పాదచారులు, ఇతర వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ తరహా సమస్య రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్, భీమునిగుమ్మం హైస్కూల్, దాసరిగెడ్డ రోడ్డులో సత్తెమ్మతల్లి ముఖద్వారం, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా వుంది.
ఎక్కడపడితే అక్కడ ద్విచక్ర వాహనాలు నిలుపుదల
ఇబ్బంది పడుతున్న పాదచారులు, ఇతర వాహనదారులు
పట్టించుకోని అధికారులు
అనకాపల్లి టౌన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ద్విచక్ర వాహనాలను ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చిన రీతిలో పార్కింగ్ చేస్తున్నారు. పోలీసులు ‘నో పార్కింగ్’ అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినచోట కూడా వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే పాదచారులు, ఇతర వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ తరహా సమస్య రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్, భీమునిగుమ్మం హైస్కూల్, దాసరిగెడ్డ రోడ్డులో సత్తెమ్మతల్లి ముఖద్వారం, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా వుంది.
చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్‌లతో పాటు ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ భారీ సంఖ్యలో వాహనచోదకులు తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసి వివిధ పనుల పై విశాఖనగరానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే వాహనాలకు ఎవరూ కాపాలా లేకపోవడాన్ని గమనించిన ద్విచక్ర వాహనచోదకులు తమకు నచ్చిన బైక్‌లను అపహరించుకుపోతున్న సంఘటనలు లేకపోలేదు. దీంతో వాహనచోదకులు పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది.
అనకాపల్లి రైల్వేస్టేషన్ వద్ద బుకింగ్ ఆఫీసు ముందు భాగంలో జీవీఎంసీ స్థలంలో ఉన్న ఆక్రమణలను జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి, టీపీవో ఓ.వరప్రసాద్ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం తొలగించారు. రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటరు పక్కన ఉన్న వాహనాల పార్కింగ్ స్థలాన్ని రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా మూసివేశారు. రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్డు వైపు వాహనాల పార్కింగ్ కోసం ఆరు నెలల కాలానికి కాంట్రాక్టర్‌కు అద్దెకు ఇచ్చారు. అయితే ఇటీవల వరకు బుకింగ్ ఆఫీసు పక్కన పార్కింగ్ స్థలంలో వాహనాలు పెట్టే వారు.. ఇప్పుడు జీవీఎంసీ అధికారులు తొలగించిన దుకాణాల స్థలాల్లో వాహనాలు పెడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది రోజూ ఉదయం ఇక్కడి నుంచి విశాఖ వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుంటారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం ముందు ఖాళీ ప్రదేశంలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో కాంప్లెక్స్‌లోకి వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఔట్‌గేటు పక్కన పార్కింగ్ స్థలం వుంది. ఇక్కడ అయితే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ప్రధాన మార్గంలో పార్కింగ్ చేస్తున్నారు. ఇంకా భీమునిగుమ్మం పాఠశాల ముందు ఖాళీ స్థలంలో, దాసరిగెడ్డ రోడ్డులోని సత్తెమ్మతల్లి ముఖద్వారం వద్ద, మునసబుగారి బంగ్లా పక్కన వాహనాలు పార్కింగ్ చేయడంతో ఆయా మార్గాల్లో భారీ వాహనాలు రాకపోకలు సాగించేటప్పుడు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే స్టేషన్ వద్ద ఇష్టారాజ్యంగా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయడంపై ఆర్‌పీఎఫ్ సీఐ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా జీవీఎంసీ అధికారులు ఖాళీ చేయించిన బడ్డీల ప్రదేశంలో వాహనదారులు పార్కింగ్ చేస్తున్నారని, దీనిపై జీవీఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ గేటు వద్ద వాహనాల పార్కింగ్‌పై ఆర్టీసీ డీపీటీవో వి.ప్రవీణను వివరణ కోరగా... పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.