Share News

పంచారామాల క్షేత్రదర్శని ప్రారంభం

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:07 PM

కార్తీక మాసంలో ప్రముఖ శివాలయాలను దర్శించుకోవాలనే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం పంచారామాల క్షేత్రదర్శని పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతుందని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పంచారామాల క్షేత్రదర్శని మొదటి బస్సును శనివారం ఆయన ద్వారకా బస్‌స్టేషన్‌లో ప్రారంభించారు.

పంచారామాల క్షేత్రదర్శని ప్రారంభం
జెండా ఊపి ప్రత్యేక బస్సును ప్రారంభిస్తున్న ఆర్‌ఎం అప్పలనాయుడు

ద్వారకాబస్‌స్టేషన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంలో ప్రముఖ శివాలయాలను దర్శించుకోవాలనే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం పంచారామాల క్షేత్రదర్శని పేరిట ప్రత్యేక బస్సులను నడుపుతుందని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పంచారామాల క్షేత్రదర్శని మొదటి బస్సును శనివారం ఆయన ద్వారకా బస్‌స్టేషన్‌లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన ఈ బస్సు ఆదివారం ఉదయానికి అమరావతికి చేరుకుంటుందిని, భక్తులు అక్కడ శ్రీఅమరేశ్వరుడిని దర్శించుకున్నాక భీమవరం చేరుకుంటుందన్నారు. శ్రీభీమేశ్వరుని దర్శనానంతరం పాలకొల్లు క్షీరరామలింగేశ్వరుడిని, అక్కడనుంచి ద్రాక్షారామం చేరుకుని భీమలింగేశ్వడిని భక్తులు దర్శించుకుంటారన్నారు. ఆ తరువాత సామర్లకోట కుమార రామలింగేశ్వరుడిని దర్శించుకున్నాక రాత్రికి విశాఖకు భక్తులు చేరుకుంటుంటారని వివరించారు. కార్యక్రమంలో డీసీఎంఈ గంగాధర్‌, డిపో మేనేజర్‌ మాధురి, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కమర్షియల్‌ బాపిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:07 PM