ఊపందుకున్న వరినాట్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:28 AM
జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు 41 వేల 546 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 41,546 హెక్టార్లల్లో పూర్తి
వ్యవసాయ అధికారి మోహన్‌రావు
అనకాపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు 41 వేల 546 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు వారాల నుంచి కురుస్తున్న వర్షాలతోపాటు చెరువుల్లో నీరు చేరడంతో వరినాట్లు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. వరి రైతులకు 3,500 టన్నుల యూరియా అవసరం కాగా 1,111 టన్నుల యూరియా ప్రైవేట్ డీలర్లు, పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో వుంచామని చెప్పారు. ఈ వారం 730 టన్నుల యూరియా కేటాయింపు జరిగిందని తెలియజేశారు. యూరియాను బ్లాక్ చేయకుండా, అధిక ధరలకు అమ్మకుండా విజిలెన్స్, మల్టీ డిసిప్లినరీ టీమ్స్ వారు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.