Share News

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:09 AM

దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుని, తిరిగి ఉద్యోగం, ఉపాధి చేస్తున్న ప్రదేశాలకు వెళ్లేవారు, బంధువుల ఇళ్లకు వచ్చి స్వగ్రామాలకు కుటుంబాలతో సహా వెళుతున్న వారితో ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిటలాడింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రద్దీ కొనసాగింది. బస్సు ప్లాట్‌ ఫారం వద్దకు రావడమే తరువాయి.. లోపలికి ఎక్కడానికి ఎగబడ్డారు. సీట్ల కోసం హడావిడి చేశారు. కొంతమంది కిటికీల్లో నుంచి లగేజీని బస్సు సీట్లలో వేసి బస్సు ఎక్కారు. నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి, విశాఖపట్నం, గాజువాక, విజయనగరం ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కిటకిటలాడాయి. చాలా మంది నిల్చొని ప్రయాణించాల్సి వచ్చింది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట
దేవరాపల్లి వెళ్లే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

దసరా తిరుగు ప్రయాణాలతో రద్దీగా నడిచిన బస్సులు

అనకాపల్లి డిపోకు రూ.2 కోట్లకుపైగా ఆదాయం

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుని, తిరిగి ఉద్యోగం, ఉపాధి చేస్తున్న ప్రదేశాలకు వెళ్లేవారు, బంధువుల ఇళ్లకు వచ్చి స్వగ్రామాలకు కుటుంబాలతో సహా వెళుతున్న వారితో ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిటలాడింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రద్దీ కొనసాగింది. బస్సు ప్లాట్‌ ఫారం వద్దకు రావడమే తరువాయి.. లోపలికి ఎక్కడానికి ఎగబడ్డారు. సీట్ల కోసం హడావిడి చేశారు. కొంతమంది కిటికీల్లో నుంచి లగేజీని బస్సు సీట్లలో వేసి బస్సు ఎక్కారు. నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి, విశాఖపట్నం, గాజువాక, విజయనగరం ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ కిటకిటలాడాయి. చాలా మంది నిల్చొని ప్రయాణించాల్సి వచ్చింది.

దసరా ప్రయాణాల ఆదాయం రూ.2 కోట్లు

దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అనకాపల్లి డిపోకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించిందని డీపీటీవో వి.ప్రవీణ తెలిపారు. అనకాపల్లి డిపో నుంచి శనివారం నడిపిన బస్సుల్లో సగటున ఓఆర్‌ 124 శాతం నమోదైందని చెప్పారు. దసరా పండగ ప్రారంభం నుంచి ఓఆర్‌ వంద శాతానికిపైగా వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి తెచ్చిన తరువాత ఓఆర్‌ శాతం బాగా పెరిగిందన్నారు. విజయవాడ వెళ్లే భవానీ మాలధారుల కోసం ప్రత్యేక బస్సులను నడిపినట్టు ఆమె తెలిపారు.

Updated Date - Oct 06 , 2025 | 12:09 AM