Share News

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:59 PM

విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడంతో దూర ప్రాంతాల విద్యార్థులు, ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు తరలి వెళ్లడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆదివారం రద్దీగా మారింది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట
ప్రయాణికులతో రద్దీగా ఉన్న పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌

దసరా సెలవులు ఇవ్వడంతో ప్రయాణికులతో రద్దీ

పాడేరురూరల్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడంతో దూర ప్రాంతాల విద్యార్థులు, ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు తరలి వెళ్లడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆదివారం రద్దీగా మారింది. విశాఖ, అనకాపల్లి, గుంటూరు, చోడవరం, విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రైవేటు జీపులు కూడా కిక్కిరిసి వెళ్లాయి. ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ లేకపోవడంతో చాలా మంది జీపులను ఆశ్రయించారు. సాధారణ రోజుల్లో పాడేరు నుంచి చోడవరానికి ఒక్కొక్కరికి రూ.100 తీసుకునే జీపు డ్రైవర్లు ఇప్పుడు డిమాండ్‌ దృష్ట్యా రూ.150 తీసుకుంటున్నారు. అంతేకాకుండా పరిమితికి మించి ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులను నడపాలని ప్రయాణికులను కోరుతున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 10:59 PM