కొనసాగుతున్న ఆపరేషన్‌లంగ్స్
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:18 AM
నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లతోపాటు పార్కులను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, ఆక్రమణలను తొలగించేందుకు జీవీఎంసీ చేపడుతున్న ఆపరేషన్ లంగ్స్ 2.0 ఆదివారం కూడా కొనసాగింది. జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో 319 ఆక్రమణలను టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. శనివారం 336 ఆక్రమణలను తొలగించిన విషయం తెలిసిందే. సోమవారం కూడా ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ జరుగుతుందని సీసీపీ ప్రభాకరరావు తెలిపారు.
రెండో రోజు 319 ఆక్రమణల తొలగింపు
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లతోపాటు పార్కులను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, ఆక్రమణలను తొలగించేందుకు జీవీఎంసీ చేపడుతున్న ఆపరేషన్ లంగ్స్ 2.0 ఆదివారం కూడా కొనసాగింది. జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో 319 ఆక్రమణలను టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. శనివారం 336 ఆక్రమణలను తొలగించిన విషయం తెలిసిందే. సోమవారం కూడా ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ జరుగుతుందని సీసీపీ ప్రభాకరరావు తెలిపారు. ఆక్రమణల్లో ఉన్నవారు, ఫుట్‌పాత్‌లపై దుకాణాలను నడుపుతున్నవారు స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలని కోరారు.