వంద కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:12 PM
మండలంలోని కొంతెలి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో వంద కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని అరెస్టు చేశారు.
కొంతెలి కూడలి వద్ద ఐదుగురి అరెస్టు
ఒడిశా నుంచి బెంగళూరు తరలింపు
హుకుంపేట, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని కొంతెలి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో వంద కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశా నుంచి ఏజెన్సీ మీదుగా గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు ఆదివారం మండలం కొంతెలి కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా వంద కిలోల గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నామని నిందితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సన్యాసినాయుడు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.