వైసీపీ సేవలో అధికారులు
ABN , Publish Date - May 05 , 2025 | 12:47 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో నెల రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. అయినప్పటికీ పలువురు అధికారులు ఇంకా వైసీపీ సేవలోనే తరిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై ఇప్పటికీ గత సీఎం చిత్రాలు, అప్పటి ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు కొనసాగుతూనే వున్నాయి. ఇందుకు రోలుగుంట మండలం కొమరవోలులోని రైతు సేవా కేంద్రం ఒక ఉదాహరణ.
ప్రభుత్వ కార్యాలయాలపై తొలగించని జగన్ బొమ్మలు, నవరత్నాల లోగోలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు
అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు
రోలుగుంట, మే 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మరో నెల రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. అయినప్పటికీ పలువురు అధికారులు ఇంకా వైసీపీ సేవలోనే తరిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై ఇప్పటికీ గత సీఎం చిత్రాలు, అప్పటి ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు కొనసాగుతూనే వున్నాయి. ఇందుకు రోలుగుంట మండలం కొమరవోలులోని రైతు సేవా కేంద్రం ఒక ఉదాహరణ. గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను (ఆర్‌బీకే) ఏర్పాటు చేసి, వాటిపై నాటి సీఎం జగన్ ఫొటోతోపాటు నవరత్నాల పేరుతో ఆయా పథకాల పేర్లు రాశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటోలు, భవనాలపై ఉన్న పేర్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌బీకేలను రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కానీ కొమరవోలు రైతు భరోసా కేంద్ర పేరు మార్చలేదు. జగన్ బొమ్మతో కూడిన నవరత్నాల లోగోను తొలగించలేదు. కుసర్లపూడిలో గ్రామ సచివాలయం మీద కూడా వైసీపీ నవరత్నాల లోగో ఇప్పటికీ దర్శనమిస్తున్నది.