నూకాంబిక ఆలయం కిటకిట
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:32 PM
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బాలాలయంలోని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
అనకాపల్లి టౌన్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బాలాలయంలోని అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన శుభకార్యాల్లో భాగంగా పలువురు భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులు వంటలు తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పాలకవర్గ సభ్యులు తగిన చర్యలు తీసుకున్నారు.