ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు 91.62 శాతం పంపిణీ
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:26 AM
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద మొదటి రోజైన సోమవారం 91.62 శాతం మందికి డబ్బులు పంపిణీ చేశారు.
అనకాపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద మొదటి రోజైన సోమవారం 91.62 శాతం మందికి డబ్బులు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 2,56,338 మంది పింఛన్‌దారులు వుండగా, సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 2,34,866 మందికి నగదు పంపిణీ చేసినట్టు డీఆర్‌డీఏ పీడీ శచీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. డోర్‌లాక్, వలస వె ళ్లిన పింఛన్‌దారులకు రెండు, మూడు రోజుల్లో డబ్బులు పంపిణీ చేస్తామన్నారు. కాగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పలువురు ప్రజాప్రతినిధులు, అఽధికారులు పాల్గొన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మండలం అమలాపురంలో పలువురు లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందించారు. కలెక్టర్ విజయకృష్ణన్ పరవాడ మండలం కన్నూరులో, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు రావికమతం మండలం కొత్తకోటలో, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కె.కోటపాడు మండలం సూర్రెడ్డిపాలెంలో పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు.