ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ము 93.08 శాతం మందికి పంపిణీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:25 AM
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ తొలిరోజు శుక్రవారం 93.08 శాతం పూర్తయ్యింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శచీదేవి విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలో 2,58,120 మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్‌దారులు ఉండగా.. ఆగస్టు నెలలో పంపిణీ కోసం ప్రభుత్వం రూ.108.91 కోట్లు విడుదల చేసింది.
అనకాపల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ తొలిరోజు శుక్రవారం 93.08 శాతం పూర్తయ్యింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శచీదేవి విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలో 2,58,120 మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్‌దారులు ఉండగా.. ఆగస్టు నెలలో పంపిణీ కోసం ప్రభుత్వం రూ.108.91 కోట్లు విడుదల చేసింది. సచివాలయాల సిబ్బంది గురువారమే ఆయా బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి, శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేశారు. పలుచోట్ల కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు 2,40,267 (93.08 శాతం) మందికి నగదు పంపిణీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసిన వున్న వారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. నాతవరం మండలం గునుపూడిలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి మండలం పిసినికాడలో కలెక్టర్ విజయకృష్ణన్ పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు డబ్బులు అందించారు.