సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంటు నిర్మాణానికి ఎన్‌టీపీసీ టెండర్లు
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:16 PM
అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద నిర్మించబోయే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్‌ఏఎఫ్) ప్లాంటు నిర్మాణానికిఎన్‌టీపీసీ టెండర్లను ఆహ్వానించింది.
అచ్యుతాపురం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద నిర్మించబోయే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్‌ఏఎఫ్) ప్లాంటు నిర్మాణానికిఎన్‌టీపీసీ టెండర్లను ఆహ్వానించింది. సుమారు 1200 ఎకరాల్లో ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ జనవరి ఎనిమిదిన వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పవన్ విద్యుత్‌తో పాటు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇదే ప్రాంగణంలో ఏడాదికి 1800 టన్నుల ఎస్‌ఏఎఫ్ తయారుచేసే ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి డిజైనింగ్, డెవలప్‌మెంట్ విధానంలో స్వదేశీ బిడ్దర్లు ఈ నెల 27వ తేదీ నాటికి టెండర్లను సమర్పించాలని ప్రకటన విడుదల చేసింది. నవంబరు 6న బిడ్డింగ్ ఖరారు చేస్తారు.