కాంట్రాక్టర్‌కు నోటీసులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:20 AM
గాజువాక మార్కెట్‌లో ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్‌కు జోన్-6 రెవెన్యూ అధికారులు నోటీసు జారీచేశారు. జూలైలో కట్టాల్సిన సుమారు రూ.36 లక్షలు తక్షణం చెల్లించాలని ఆదేశించారు. లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ (ఈఎండీ) రూ.45 లక్షలను జమ చేసుకుని, టెండర్ రద్దుచేస్తామని స్పష్టం చేశారు.
రూ.36 లక్షలు చెల్లించాలని ఆదేశం
గాజువాక మార్కెట్ ఆశీలు వ్యవహారంపై జీవీఎంసీ చర్యలు
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ లోగో వాడాలి
విశాఖపట్నం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
గాజువాక మార్కెట్‌లో ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్‌కు జోన్-6 రెవెన్యూ అధికారులు నోటీసు జారీచేశారు. జూలైలో కట్టాల్సిన సుమారు రూ.36 లక్షలు తక్షణం చెల్లించాలని ఆదేశించారు. లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ (ఈఎండీ) రూ.45 లక్షలను జమ చేసుకుని, టెండర్ రద్దుచేస్తామని స్పష్టం చేశారు.
గాజువాక మార్కెట్‌లో దుకాణాలు, రోడ్డుమార్జిన్‌లు, మార్కెట్‌కు లోడుతో వచ్చే వాహనాల నుంచి ఆశీలు వసూలు చేసేందుకు జీవీఎంసీ ఈ ఏడాది మార్చిలో వేలం నిర్వహించగా ఓ కాంట్రాక్టర్ రూ.2.2 కోట్లకు దక్కించుకున్నారు. దీనికి స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకపోవడంతో జూన్ నెలాఖరు వరకు జోన్-6 రెవెన్యూ అధికారులే ఆశీలు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ తానే ఆశీలు వసూలుచేశారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం ఈ అంశాన్ని జూన్‌లో పొందుపరిచారు. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి కాంట్రాక్టరు ఆశీలు వసూలుచేస్తున్నందున వేలంలో పాడిన రూ.2.2 కోట్లు జీవీఎంసీకి చెల్లించేలా సమ్మతి పత్రాన్ని తీసుకోవాలని, లేదంటే ఈఎండీని జమ చేసుకుని తిరిగి వేలం నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. కానీ జోన్-6 రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్ మార్చి నుంచి మే వరకు వసూలుచేసిన ఆశీలు మొత్తాన్ని జీవీఎంసీకి చెల్లించి, మిగిలిన తొమ్మిది నెలలకు వేలం మొత్తాన్ని లెక్కించి వసూలుచేసేలా స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసినట్టు మినిట్స్‌లో నమోదు చేయించారు. దీనిపై ఈనెల 11న ‘గాజువాక మార్కెట్‌లో మాయగాళ్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జోన్-6 రెవెన్యూ అధికారులు మార్కెట్ ఆశీలు కాంట్రాక్టర్‌కు నోటీసు జారీచేశారు.