ప్రొటోకాల్ పాటించడంలేదు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:46 AM
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంలేదని, అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని జడ్పీ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆరోపించారు. తొలుత అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు మాట్లాడుతూ, తన మండలంలో గత నెలలో ఒక అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలిని ఆహ్వానించలేదని అన్నారు.
జడ్పీ సమావేశంలో అధికారులపై సభ్యుల ఆరోపణ
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంలేదని, అధికారులు ప్రొటోకాల్ పాటించడంలేదని జడ్పీ సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆరోపించారు. తొలుత అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు మాట్లాడుతూ, తన మండలంలో గత నెలలో ఒక అంగన్‌వాడీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలిని ఆహ్వానించలేదని అన్నారు. దీనిపై సీడీపీవోకు లేఖ రాయగా.. భవనమే ప్రారంభంకాలేదని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. పరవాడ జడ్పీటీసీ సన్యాసిరాజు మాట్లాడుతూ, తన సొంత గ్రామం తాణాంలో ప్రభుత్వ భవనం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. దీంతో పలువురు సభ్యులు లేచి, పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సైతం.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంంబంధించి తనకు కూడా ఆహ్వానం అందడం లేదన్నారు. అనకాపల్లి కలెక్టర్ స్పందిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ పాటించాల్సిందేని అధికారులకు స్పష్టం చేశారు.