Share News

ఎలమంచిలి ఎంపీపీపై అవిశ్వాసం

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:09 AM

ఎలమంచిలి మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్షునిపై అవిశ్వాసం ప్రకటిస్తూ పలవురు ఎంపీటీసీ సభ్యులు బుధవారం ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ రాజాన శేషు మీడియాతో మాట్లాడుతూ, తనతోపాటు మరో వైస్‌ఎంపీపీ శిలపరశెట్టి ఉమ (జంపపాలెం), ఎంపీటీసీ సభ్యులు నగిరెడ్డి అమ్మాజీ (ఏటికొప్పాక-1), బర్రే శివలక్ష్మి (కొత్తలి) అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసి తొలుత అనకాపల్లి ఆర్డీఓకు, అనంతరం ఎలమంచిలి ఇన్‌చార్జి ఎంపీడీఓకు అందజేసినట్టు చెప్పారు.

ఎలమంచిలి ఎంపీపీపై అవిశ్వాసం
ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావుకు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేస్తున్న వైస్‌ ఎంపీపీలు రాజాన శేషు, ఎస్‌.ఉమ, ఎంపీటీసీ సభ్యులు నగిరెడ్డి అమ్మాజీ, బర్రే శివలక్ష్మి

ఇన్‌చార్జి ఎంపీడీవోకు నోటీసు అందజేసిన నలుగురు సభ్యులు

మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు

ఒకరి మృతితో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు

ఎంపీపీకి వ్యతిరేకంగా నలుగురు సభ్యులు నోటీసుపై సంతకాలు

ఎలమంచిలి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్షునిపై అవిశ్వాసం ప్రకటిస్తూ పలవురు ఎంపీటీసీ సభ్యులు బుధవారం ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ రాజాన శేషు మీడియాతో మాట్లాడుతూ, తనతోపాటు మరో వైస్‌ఎంపీపీ శిలపరశెట్టి ఉమ (జంపపాలెం), ఎంపీటీసీ సభ్యులు నగిరెడ్డి అమ్మాజీ (ఏటికొప్పాక-1), బర్రే శివలక్ష్మి (కొత్తలి) అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసి తొలుత అనకాపల్లి ఆర్డీఓకు, అనంతరం ఎలమంచిలి ఇన్‌చార్జి ఎంపీడీఓకు అందజేసినట్టు చెప్పారు.

ఎలమంచిలి మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏటికొప్పాక-1 నుంచి నగిరెడ్డి అమ్మాజీ, ఏటికొప్పాక-2 నుంచి నగిరెడ్డి దేముడమ్మ (ఇటీవల మృతిచెందారు), బయ్యవరం నుంచి వూటకూటి రామగణేశ్‌, పులపర్తి నుంచి బోదెపు గోవిందరావు, కొత్తలి నుంచి బర్రె శివలక్ష్మి, రేగుపాలెం నుంచి రాజాన శేషు, జంపపాలెం నుంచి శిలపరశెట్టి ఉమ ఎన్నికయ్యారు. తరువాత ఎంపీపీగా బోదెపు గోవిందరావు, వైస్‌ ఎంపీపీలుగా రాజాన శేషు, శిలపరశెట్టి ఉమలను ఎన్నుకున్నారు. కాగా వైస్‌ ఎంపీపీ రాజాన శేషు అప్పట్లోనే ఎంపీపీ పదవిని ఆశించారు. కానీ నాడు స్థానిక ఎమ్మెల్యే ఎంపిక మేరకు గోవిందరావుకు ఎంపీపీ పదవి దక్కింది. ఇదిలావుండగా వైస్‌ ఎంపీపీలు రాజాన శేషు, ఎస్‌.ఉమ గత ఏడాది జనసేన పార్టీలో చేరారు. ఎంపీపీని పదవి నుంచి దించేయాలంటే మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది నోటీసుపై సంతకాలు చేయాలి. మండలంలో ఏడుగురు ఎంపీటీసీ సభ్యులకుగాను ఒకరు మృతిచెందడంతో ప్రస్తుతం ఆరుగురు వున్నారు. అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేయడానికి నలుగురు సభ్యులు వుండాలి. ఈ మేరకు రాజాన శేషు, శిలపరశెట్టి ఉమ, నగిరెడ్డి అమ్మాజీ, బర్రే శివలక్ష్మి అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్‌చార్జి ఎంపీడీవో త్వరలో మండల పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అవిశాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహిస్తారు.

Updated Date - Sep 25 , 2025 | 01:09 AM