తొమ్మిది ఎకరాల డి.పట్టా రద్దు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:31 AM
మండలంలోని వెదుళ్లనరవ, గంగవరం గ్రామాల్లో నిబంధనలు ఉల్లఘించి, క్రయవిక్రయాలు జరిపిన తొమ్మిది ఎకరాలకు సంబంధించిన డి.పట్టాలను తహశీల్దార్ శుక్రవారం రద్దు చేశారు. దీంతో ఆర్‌ఐ వీరయ్య, వీఆర్వో వినోద్ శుక్రవారం సంబంధిత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఆర్‌ఐ వీరయ్య తెలిపిన వివరాలిలా వున్నాయి.
నిబంధనలు ఉల్లంఘించిన లబ్ధిదారులు
ఎన్‌ఓసీ పొందకుండా క్రయవిక్రయాలు
భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
సబ్బవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెదుళ్లనరవ, గంగవరం గ్రామాల్లో నిబంధనలు ఉల్లఘించి, క్రయవిక్రయాలు జరిపిన తొమ్మిది ఎకరాలకు సంబంధించిన డి.పట్టాలను తహశీల్దార్ శుక్రవారం రద్దు చేశారు. దీంతో ఆర్‌ఐ వీరయ్య, వీఆర్వో వినోద్ శుక్రవారం సంబంధిత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఆర్‌ఐ వీరయ్య తెలిపిన వివరాలిలా వున్నాయి.
వెదుళ్లనరవ సర్వే నంబరు 94/3లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో ఓ వ్యక్తికి ప్రభుత్వం పంపిణీ చేసి డి.పట్టా ఇచ్చింది. కొంత కాలం వ్యవసాయం చేసిన తరువాత సదరు రైతు డి.పట్టా నిబంధనలు తుంగలో తొక్కి దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు 15 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. డీ పట్టా ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపిన తహశీల్దార్ బి.చిన్నికృష్ణ... పివోటీ చట్టం-1977 ప్రకారం సదరు రైతుకు ఇచ్చిన డి.పట్టాను రద్దు చేశారు. అదే విధంగా డి.పట్టా నిబంధనలను ఉల్లంఘించినందుకు గంగవరం సర్వే నంబరు 38/3లో నాలుగు ఎకరాలకు గతంలో జారీ చేసిన డి.పట్టాను కూడా రద్దు చేసి, ఈ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.