Share News

మార్కెట్లకు న్యూ ఇయర్‌ శోభ

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:58 PM

జిల్లాలోని మార్కెట్లు బుధవారం కిటకిటలాడాయి. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పండ్లు, బొకేలు, రంగులు, కేకులు కొనుగోలుకు అధిక సంఖ్యలో వినియోగదారులు రావడంతో రద్దీ నెలకొంది.

మార్కెట్లకు న్యూ ఇయర్‌ శోభ
పండ్లు, బొకేల దుకాణం వద్ద కొనుగోలుదారులు

కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిట

హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన కేకులు, బొకేలు

పాడేరురూరల్‌, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మార్కెట్లు బుధవారం కిటకిటలాడాయి. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పండ్లు, బొకేలు, రంగులు, కేకులు కొనుగోలుకు అధిక సంఖ్యలో వినియోగదారులు రావడంతో రద్దీ నెలకొంది. సాయంత్రం 5 గంటల నుంచి పాడేరు మెయిన్‌ బజారు, పాత బస్టాండ్‌, సినిమా హాల్‌ సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, పండ్లు, బొకేల దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. కమలా పండ్లు కిలో రూ.150, యాపిల్‌ కిలో రూ.250 చొప్పున వర్తకులు విక్రయించారు. కేకు కిలో రూ.300 నుంచి రూ.500, అలాగే బొకే రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయించారు. కొనుగోలుదారులతో ప్రధాన రహదారులు రద్దీగా ఉండడంతో ట్రాఫిక్‌ స్తంభించి వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Dec 31 , 2025 | 11:58 PM