న్యూ ఇయర్ హంగామా
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:01 AM
కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు.
వేడుకలకు నగరం సన్నద్ధం
స్టార్ హోటళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు
ప్రత్యేక ఆకర్షణగా సినీనటులు, గాయకులు
ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పలు స్టార్‌హోటళ్లు, రిసార్టుల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. తమ కార్యక్రమాలకు సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలను రప్పిస్తున్నాయి. రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగే ఈవెంట్‌కు సినీనటి హెబ్బాపటేల్ హాజరవుతున్నారు. వేడుకలకు హాజరయ్యేవారి కోసం పలు కేటగిరీల కింద టికెట్లు విక్రయిస్తున్నారు. ఇవి రూ.రెండు వేలు నుంచి రూ.60 వేలు వరకూ ఉన్నాయి. అలాగే నోవాటెల్ హోటల్‌లో న్యూఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ జరిగే వేడుకలకు సినీ నేపథ్య గాయిని సమీరా భరద్వాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అప్పుఘర్ సమీపంలోని గాదిరాజు ప్యాలె్‌సలో కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేసి సినీ ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఇంకా బీచ్‌రోడ్డులోని పార్కు హోటల్, రుషికొండలోని షోర్ ఫ్రంట్ రెస్టారెంట్, భీమిలిలోని నోవాటెల్, గాజువాకలోని సిగ్నేచర్ హోటల్‌తోపాటు మరికొన్ని న్యూఇయర్ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నాయి. వీటిలో పాల్గొనాలనుకునేవారి కోసం టికెట్లను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచాయి. ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌మైషో లేదా డిస్ర్టిక్ జొమాటో యాప్‌ల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది.