హెచ్‌ఎంల జిల్లా సంఘం నూతన కార్యవర్గం
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:18 AM
జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక గౌరీ గ్రంథాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఏవీహెచ్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా ఆళ్ల శేఖర్, కోశాధికారిగా నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎంఎస్ ప్రసాద్, కేఆర్‌ఎస్ నాయుడు, ఎ.వరహామూర్తితోపాటు పలువురినిజిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
అధ్యక్షునిగా ఏవీహెచ్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా ఆళ్ల శేఖర్
అనకాపల్లి టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక గౌరీ గ్రంథాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఏవీహెచ్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా ఆళ్ల శేఖర్, కోశాధికారిగా నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎంఎస్ ప్రసాద్, కేఆర్‌ఎస్ నాయుడు, ఎ.వరహామూర్తితోపాటు పలువురినిజిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి సీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్ సమస్యలను పరిష్కరించాలని, ఎంఈవోల బదిలీలను వెంటనే చేపట్టాలని, హెచ్‌ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలని, బోధనేతర విధుల నుంచి ప్రధానోపాధ్యాయులకు పూర్తిగా విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షల విభాగం సహాయ కమిషనర్ పి.శ్రీధర్‌రెడ్డి, డీసీఈ బోర్డు చైర్మన్ సీహెచ్.సత్యనారాయణ, ముఖ్య అతిథులుగా పొన్నాడ అప్పారావు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.