నగరానికి నూతన సొబగులు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:53 AM
నగరంలోని జంక్షన్లు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి.
పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో కూడళ్లలో కళాకృతుల ఏర్పాటు
నగరంలోని జంక్షన్లు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ప్రముఖులు పర్యటించే మార్గాల్లో జంక్షన్లను ప్రత్యేకంగా మారుస్తున్నారు. ఆశీల్‌మెట్ట జంక్షన్ నుంచి సంపత్ వినాయకుడి ఆలయానికి వెళ్లే మార్గంలో వేమన మందిరం ఎదురుగా కూడలిలో కొద్దిరోజుల క్రితం వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని తీసేసి గుర్రాల విగ్రహాలను పెట్టారు. అదేమార్గంలో సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనా వరకూ పలు జంక్షన్లలో రకరకాల కళాకృతులను పెట్టారు. ఆ ఐల్యాండ్లను కూడా సైజులు మార్చి, కొత్త మొక్కలు వేస్తున్నారు.
-విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి