Share News

నేడు నీట్‌

ABN , Publish Date - May 04 , 2025 | 12:46 AM

వైద్య కళాశాలల్లో బ్యాచిలర్‌ డిగ్రీ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయూష్‌)లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్‌’ ఆదివారం నగరంలోని 16 కేంద్రాల్లో జరగనున్నది.

నేడు నీట్‌

  • 7,344 మంది అభ్యర్థులు, 16 కేంద్రాలు

  • మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం

  • గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా అధికారుల సూచన

  • ఒంటి గంటలకు గేట్లు మూసివేత

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

వైద్య కళాశాలల్లో బ్యాచిలర్‌ డిగ్రీ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయూష్‌)లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్‌’ ఆదివారం నగరంలోని 16 కేంద్రాల్లో జరగనున్నది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రవేశ పరీక్షకు 7,344 మంది హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అభ్యర్థులను ఉదయం 11 నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒంటి గంట తరువాత గేట్లు మూసివేస్తారు. అంటే గంట ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ‘నీట్‌’కు సంబంధించి మల్కాపురం కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. పరీక్షనిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లుచేసింది. ప్రతి రెండు కేంద్రాలకు ఒక తహసీల్దార్‌ను ఇన్‌చార్జిగా, ప్రతి ఎనిమిది కేంద్రాలకు ఒక ఆర్డీవోను పర్యవేక్షకునిగా నియమించారు. పరీక్ష నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని నిర్వాహకులు కోరారు.


డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు ఆంధ్ర విశ్వ విద్యాలయం అధికారులు ప్రకటించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీహెచ్‌ఎం విద్యార్థులకు రెగ్యులర్‌ అండ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల ఆరో తేదీ నుంచి నిర్వి హంచేందుకు తొలుత షెడ్యూల్‌ విడుదల చేశారు. అయితే, అదే తేదీల్లో కొన్ని ప్రవేశ పరీ క్షలు జరగనుండడంతో షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు శనివారం ప్రకటించారు. ఈ నెల ఆరో తేదీ ఉదయం, మధ్యాహ్నం జరగాల్సిన రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల 21న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించ నున్నారు. ఈ నెల ఏడో తేదీన ఉదయం, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను 22న అదే సమయాల్లో నిర్వహిస్తారు. అలాగే, ఈ నెల 19న ఉదయం, మధ్యాహ్నం జరగాల్సిన సెమి స్టర్‌ పరీక్షలను 23న, 20న ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జరగాల్సిన రెండు, నాలుగో సెమిస్టర్‌కు సంబంధించిన మూడు పరీక్షలను 24న అదే సమయాల్లో నిర్వహించ నున్నట్టు అధికారులు వెల్లడించారు. ఏయూ అనుబంధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తిం చాలని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ టి.చిట్టి బాబు ఒక ప్రకటనలో కోరారు.


హైకోర్టు ఏజీపీగా పాల అశోక్‌రెడ్డి

గాజువాక, మే 3 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు అడిషనల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ (ఏజీపీ)గా పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన పాల అశోక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. అశోక్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు, విశాఖ జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు బత్తి రాజశేఖర్‌కు అశోక్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 04 , 2025 | 12:46 AM