Share News

ఉత్సాహంగా నేవీ మారథాన్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:19 AM

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌ రోడ్డులో నిర్వహించిన నేవీ మారథాన్‌ పదో ఎడిషన్‌ ఉత్సాహంగా సాగింది. ఆర్కే బీచ్‌ కాళీమాత దేవాలయం వద్ద నిర్వహించిన మారథాన్‌లో వేలాది మంది యువతీ, యువకులు, నేవీ ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

  ఉత్సాహంగా నేవీ మారథాన్‌

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌ రోడ్డులో నిర్వహించిన నేవీ మారథాన్‌ పదో ఎడిషన్‌ ఉత్సాహంగా సాగింది. ఆర్కే బీచ్‌ కాళీమాత దేవాలయం వద్ద నిర్వహించిన మారథాన్‌లో వేలాది మంది యువతీ, యువకులు, నేవీ ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. మారథాన్‌ను తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి, వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భళ్లా జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి హాజరై మారథాన్‌లోని పలు కేటగిరీలను ప్రారంభించారు. 42కే, 21కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించగా, సుమారు 17 దేశాలకు చెందిన అథ్లెట్లతో సహా 17 వేల మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మాట్లాడుతూ మారథాన్‌ విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందన్నారు. అనంతరం విజేతలకు అవార్డులు, నగదు బహుమతులు అందించారు.

- వివరాలు 8లో

Updated Date - Dec 15 , 2025 | 01:19 AM