Share News

నర్సీపట్నం టిడ్కో ఇళ్లు వచ్చే నెలాఖరుకు అప్పగింత

ABN , Publish Date - May 02 , 2025 | 12:12 AM

నర్సీపట్నంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జూన్‌ నెలాఖరునాటికి లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టందని ఏపీ టిడ్కో స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సీహెచ్‌ నాగబాబు తెలిపారు. గురువారం మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ సురేంద్రపాటు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

నర్సీపట్నం టిడ్కో ఇళ్లు వచ్చే నెలాఖరుకు అప్పగింత
మెప్మా సిబ్బందితో సమావేశమైన ఏపీ టిడ్కో స్టేట్‌ కోఆర్డినేటర్‌ నాగబాబు

సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌ నాగబాబు

నర్సీపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జూన్‌ నెలాఖరునాటికి లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టందని ఏపీ టిడ్కో స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సీహెచ్‌ నాగబాబు తెలిపారు. గురువారం మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ సురేంద్రపాటు మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన టిడ్కో కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, టిడ్కో గృహసముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరగా పూర్తిచేయిస్తామని చెప్పారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఆయన చెప్పారు. తర్వాత ఆ డాక్యుమెంట్లను బ్యాంకులకు అందజేస్తే రుణాలు మంజూరు అవుతాయని అన్నారు. ఈ సమావేశంలో మెప్మా సీవో రమాదేవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:12 AM