Share News

ఏసీబీ వలలో నర్సింగబిల్లి వీఆర్వో

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:37 AM

మండలంలోని నర్సింగబిల్లి వీఆర్వో శ్రీసూర్యకృష్ణ పృథ్వీ ఏసీబీ వలకు చిక్కారు. మ్యుటేషన్‌ పూర్తి చేసేందుకు ఓ రైతు నుంచి రూ.20 వేల తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్‌.నాగేశ్వరరావు స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఏసీబీ వలలో నర్సింగబిల్లి వీఆర్వో
వీఆర్‌వో శ్రీసూర్యకృష్ణ పృథ్వీ

మ్యుటేషన్‌కు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

కశింకోట, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగబిల్లి వీఆర్వో శ్రీసూర్యకృష్ణ పృథ్వీ ఏసీబీ వలకు చిక్కారు. మ్యుటేషన్‌ పూర్తి చేసేందుకు ఓ రైతు నుంచి రూ.20 వేల తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్‌.నాగేశ్వరరావు స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలిలా వున్నాయి.

నర్సింగబిల్లి గ్రామానికి వూడి నాగేశ్వరరావుకు తల్లి నుంచి వారసత్వంగా 2.10 ఎకరాల భూమి సక్రమించింది. తన పేరు మీద మ్యుటేషన్‌ చేసేందుకు గత నెలలో తహసీల్దారు కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. మ్యుటేషన్‌ చేయాలంటే రూ.40 లంచం ఇవ్వాలని వీఆర్వో గన్నమరాజు శ్రీసూర్యకృష్ణ పృథ్వీ డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.20 వేలకు మించి తగ్గించేది లేదని వీఆర్వో స్పష్టం చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని నాగేశ్వరరావు ఈ నెల 2వ తేదీన ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారు చెప్పిన ప్రకారం వీఆర్వోకు ఫోన్‌ చేసి, రూ.20 లంచంగా ఇవ్వడానికి సిద్ధంగా వున్నానని, ఎక్కడికి వచ్చి ఇవ్వాలని అడిగారు. ఆయన చెప్పిన మేరకు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జట్టపురెడ్డి తుని, నర్సింగబిల్లి గ్రామాలకు చెందిన సచివాలయానికి నాగేశ్వరరావు నగదుతో వెళ్లారు. వీఆర్వో డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే సమీపంలో మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లారు.

Updated Date - Sep 05 , 2025 | 12:37 AM