ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈగా నాగేశ్వరరావు
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:10 AM
గ్రామీణా నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బీవీవీ నాగేశ్వరరావు గురువారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈఈగా పని చేసిన జవహర్‌కుమార్ గత నెల 31న పదవీవిరమణ చేశారు.
పాడేరులో బాధ్యతల స్వీకరణ
పాడేరు, జూన్ 12(ఆంధ్రజ్యోతి): గ్రామీణా నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బీవీవీ నాగేశ్వరరావు గురువారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈఈగా పని చేసిన జవహర్‌కుమార్ గత నెల 31న పదవీవిరమణ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గ్రామీణా నీటి సరఫరా విభాగం ఈఈ పని చేస్తున్న బీవీవీ నాగేశ్వరరావును పాడేరుకు బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది, కాంట్రాక్టర్లు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.