Share News

నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు కన్నుమూత

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:31 AM

టీడీపీ సీనియర్‌ నాయకుడు, నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు (55) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  గాడు అప్పలనాయుడు  కన్నుమూత

నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

గాడు అప్పలనాయుడు

కన్నుమూత

భీమునిపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

టీడీపీ సీనియర్‌ నాయకుడు, నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు (55) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వేకువజామున ఐదు గంటలకు మృతి చెందారు. అప్పలనాయుడు భీమిలి వెంకటేశ్వరస్వామి దేవాలయం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన భార్య చిన్నికుమారిలక్ష్మి జీవీఎంసీ కార్పొరేటర్‌. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా కుమార్తె హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతోంది. అప్పలనాయుడు మృతి పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 01:31 AM