జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగజ్యోతి సత్తా
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:32 AM
జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్-2025 పోటీల్లో రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీఎం నాగజ్యోతి సత్తా చాటారు. కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 8 రాష్ర్టాలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించిన ఉపాధ్యాయిని
రోలుగుంట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్-2025 పోటీల్లో రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీఎం నాగజ్యోతి సత్తా చాటారు. కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 8 రాష్ర్టాలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాస్టర్స్ 72 కేజీల విభాగంలో పాల్గొన్న నాగజ్యోతి డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, పుష్-ఫుల్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. బెంచ్ ప్రెస్ విభాగంలో స్వర్ణం, డెడ్ లిఫ్ట్ విభాగంలో స్వర్ణం, పుష్- ఫుల్ విభాగంలో రజత పతకాన్ని సాధించారు. ఒక సిల్వర్ మెడల్‌ను సాధించారు. పతకాలు సాధించిన నాగజ్యోతిని పాఠశాల హెచ్‌ఎం శేషగిరిరావు, ఉపాధ్యాయులు అభినందించారు.