విద్యార్థులకు ‘ముస్తాబు’
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:29 PM
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి చక్కగా ముస్తాబు కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో
కలెక్టర్ దినేశ్‌కుమార్ ప్రారంభం
పాడేరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి చక్కగా ముస్తాబు కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. విద్యార్థుల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల శుభ్రత, ఆరోగ్యం, పోషకాహారం, సదుపాయాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. అలాగే విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ముస్తాబు కార్యక్రమంలో గిరిజన ప్రాంతంలోని విద్యాలయాలు, విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ కోరారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీవీబీ.పరిమిళ, డీఈవో డాక్టర్ కె.రామకృష్ణారావు, ఏటీడబ్ల్యూవో అఖిల, హెచ్‌ఎం టి.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.