Share News

రెండు నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:31 PM

ఆగస్టు రెండో తేదీ నుంచి మునిసిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టనున్నట్టు ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోన లక్ష్మణ చెప్పారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తికి సమ్మె నోటీసు అందజేశారు.

రెండు నుంచి మునిసిపల్‌ కార్మికుల సమ్మె
జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ చక్రవర్తికి సమ్మె నోటీసు ఇస్తున్న కోన లక్ష్మణ

జడ్సీకి నోటీసు ఇచ్చిన యూనియన్‌ నాయకులు

అనకాపల్లి టౌన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు రెండో తేదీ నుంచి మునిసిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టనున్నట్టు ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోన లక్ష్మణ చెప్పారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తికి సమ్మె నోటీసు అందజేశారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులకు, ఆఫీస్‌ సిబ్బందికి, పార్కు కూలీలకు వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, డీఏలు, సరెండర్‌ లీవ్‌లు విడుదల చేయాలని, రిటైర్డు కార్మికులకు గ్రాట్యూటీ చెల్లించాలని కోరారు. కార్మికులపై పనిభారం పెరిగినప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మొగ్గు చూపకపోవడం విచారకరమన్నారు. ఇందుకు నిరసనగా రెండో తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సతీశ్‌కుమార్‌, సింగంపల్లి అజయ్‌కుమార్‌, యర్రంశెట్టి అప్పారాజు, బంగారి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:31 PM