వినియోగంలోకి మల్టీపర్పస్ భవనాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:40 PM
ఏజెన్సీలో నిర్మాణం పూర్తి చేసుకున్న మల్టీపర్పస్ భవనాలను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఆదేశించారు.
ముంతమామిడిలోని భవనాన్ని నమూనాగా తీసుకోవాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ
పాడేరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో నిర్మాణం పూర్తి చేసుకున్న మల్టీపర్పస్ భవనాలను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఆదేశించారు. మండలంలోని మినుములూరు పంచాయతీ ముంతమామిడి గ్రామంలో నిర్మించిన మల్టీపర్పస్ భవనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల అఽధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ముంతమామిడిలో నిర్మించిన మల్టీపర్పస్ భవానాన్ని ఒక నమూనాగా తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో ఇదే తరహాలో వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. ఇందులోనే సామాజిక భవనం, స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం, హెల్త్ సబ్‌సెంటర్ నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన చర్యలను ఆయా శాఖలకు చెందిన అధికారులు చేపట్టాలని జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి దుర్గాప్రసాద్, మినుములూరు పీహెచ్‌సీ డాక్టర్ సాయిశ్రీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దినసరి వేతనాల స్థిరీకరణ
జిల్లాలో దినసరి వేతనాల స్థిరీకరణ జరిగిందని, వివిధ శాఖల అధికారులు వాటిని అనుసరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ సూచించారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను దినసరి వేతనాల స్థిరీకరణ జరిగిందని, దీంతో జూలై ఒకటి 2024 నుంచి 2025 జూన్ 30 వరకు ఆయా వేతనాలు అమల్లో ఉంటాయన్నారు. వాటిని అధికారులు అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్, సీపీవో ప్రసాద్, కార్మిక శాఖ ఏసీ సుజాత, ఇరిగేషన్ డీఈఈ నాగేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి తులసి, అటవీ రేంజ్ అధికారి ప్రేమ, తదితరులు పాల్గొన్నారు.