స్వర్ణ పంచాయతీ పోర్టల్‌తో బహుళ సేవలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:14 AM
గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, అక్రమాలను నిరోధించడానికి ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణతేజ చెప్పారు. ఆయన శుక్రవారం అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని పంచాయతీల కార్యకలాపాలు, సేవలు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఈ పోర్టల్‌లో ఎన్ని రకాల సేవలు అందుతున్నాయో ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ
కొత్తూరు (అనకాపల్లి), ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, అక్రమాలను నిరోధించడానికి ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణతేజ చెప్పారు. ఆయన శుక్రవారం అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని పంచాయతీల కార్యకలాపాలు, సేవలు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఈ పోర్టల్‌లో ఎన్ని రకాల సేవలు అందుతున్నాయో ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చన్నారు. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తరువాత పంచాయతీల ఆదాయం పెరిగిందని తెలిపారు. అనంతరం కొత్తగా నిర్మితమవుతున్న డీఎల్‌డీవో కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, డీపీవో ఇ.సందీప్, డీఎల్‌డీవో మంజులావాణి, ఎంపీడీవో దూలిపల్లి రాము, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, సర్పంచ్ సప్పారపు లక్ష్మిప్రసన్న, ఉపసర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి సుభాశ్, తదితరులు వున్నారు.